"మంచి పనులన్నీ కష్టపడి చేయవలసి ఉంటుంది. సుఖం ఔన్నత్యం కలిసి జతగా ఉండలేవు. కష్టాలు మనిషిని ఎల్లప్పుడూ జాగ్రత్తగాను, పొందికగాను ఉండేటట్లు చేస్తాయి. మనిషిలో నిగూఢంగా ఉన్న కౌశల్యాలు, అపరిమితమైన తెలివి తేటలు క్రమమయ్యే లాగ చేస్తాయి. ధైర్యాన్ని పెంపొందిస్తాయి. విశ్వాసం వేళ్ళు నాటుకొని బలపడేటట్లుగా చేస్తాయి.
(లో.పు.13)