ప్రేమస్వరూపులైన విద్యార్థులారా! జీవితమును దేశమునకు అంకితము గావించుకునే భావముతో మీ హృదయమును నింపుకోవాలి. కేవలము స్వార్థము సరియైనది కాదు. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.మానవుడు కేవలము స్వార్ధములోనే మునిగి జగత్తులో వుండిన దుర్గుణములను, దురాచారములను, దురహంకారములను రూపుమాపలేక పోతున్నాడు. ప్రేమను పెంచుకోవాలి. విశాలమైన మనస్సు అభివృద్ధి గావించుకోవాలి.
Love lives by giving and forgiving
Self lives by getting and forgetting
(ఉ.బ్బపు.4)