భక్తి అనునది యెక్కడి నుండియో వచ్చి పడునది కాదు. ఎవరూ అందించునది కాదు. భూమినుండి రాలేదు. ఆకాశము నుండి పడలేదు. తనలోనుండియే వచ్చు భగవదనురాగము, భక్తునిలోని ప్రేమవృత్తి ప్రవాహము చెల్లాచెదరై ప్రవహించక భగవంతునివైపు యేకోన్ముఖము గా ప్రవహించిన ప్రేమ ప్రవాహమే భక్తి అని పిలువబడును.
ప్రేమ సర్వప్రాణుల యందును కలదు. ప్రేమలేని జీవిలేదు. పశుపక్షి మృగాదులకు క్రిమికీటకాదులకు కూడా, వాటికి తగిన ప్రేమ వాటికున్నది. వేయేల! ప్రేమే జీవనము, జీవనమే ప్రేమ.
(గీ.పు.193)