బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, గీత, జ్ఞాన ప్రాప్తికి ప్రస్థాన త్రయములు, త్రిమూర్తి స్వరూపములు. బ్రహ్మ సూత్రములను అర్థము చేసుకొనుట కఠినమైన విషయము. ఇది అధికార పురుషులకు తప్ప అన్యుల కందునది కాదు. అధికార పురుషులనగా సాధన చతుష్టయ సంపన్నులు. అట్టి వారికిది కరతలామలకము. మానవుడు తనను తాను ఉద్ధరించుకొనవలెనన్న మొదట సాధన చతుష్టయమును సాధించి తీరవలెను.
(సూ.వా.పు.2/3)