"క్రైస్తవమత చిహ్నమైన సిలువ అహం ను ఖండించి వేస్తున్నది; పార్సీమత చిహ్నమైన అగ్ని అన్ని నీచ వాంఛలను దహించివేస్తున్నది; బౌద్ధమత చిహ్నము, చక్రము మన బంధమోక్షములకు కారణచక్రము, ఇస్లాం మత చిహ్నము చంద్రరేఖనక్షత్రము భగవంతునియందచంచల విశ్వాసమును సూచించుతుంది. ప్రణవమైన ఓం సృష్టిస్థితుల విధానములన్నింటిని క్రోడీకరించబడిన ఆధ్యాత్మిక విజయము యొక్క చరమ స్థితికి చిహ్నము.
(స. సా.జాలై 75 పు.105)