కొన్ని సంవత్సరాల క్రిందట ఒకనాడు స్వామి చుట్టూ భక్తులు కూర్చొని సంభాషిస్తూ ఉండగా, "స్వామీ! మీ అవతరణ ప్రసవమా లేక ప్రవేశమా?"అని ఒకరు ప్రశ్నించారు. హఠాత్తుగా అక్కడి వాతావరణంమారిపోయింది. ఏదో తమాషాగా మాట్లాడుతూ ఉన్నవారు ఒక్క కుదుపుకు లోనైనట్లు భావించారు. స్వామి తమకు ఎదురుగా కూర్చున్న ఈశ్వరమ్మను చూసి "నీవు చెప్పు రామశర్మకు. ఆ రోజన మీ అత్తగారు హెచ్చరించిన తరువాత ఏమి జరిగిందో" అన్నారు. రామశర్మ పురాణాలను క్షుణ్ణంగా చదివిన పండితులు. ఈశ్వరమ్మ ఇలా వివరించింది.
“మా అత్తగారికి కలలో సత్యనారాయణ స్వామి కనిపించారు. అందువల్ల ఏ అద్భుతమైనా జరగవచ్చు. నీవు గాభరాపడవాకు" అని నాతో చెప్పింది. తరువాత నేను బావివద్ద నీళ్ళు తోడుతున్నప్పుడు విలంగానున్న తేజో రాశి గుండ్రంగా బింబంవలె ఆయి నావద్దకు దొర్లుకుంటూ వచ్చింది. నేను మూర్చ పోయాను. అది నాలో ప్రవేశించినట్లు తెలుసు కున్నాను".
స్వామిరామశర్మవంక తిరిగి, “అదీ సమాధానం. నన్నుప్రసవించలేదు. అది ప్రవేశమే" అన్నారు.
(స సా.మే 2000పు.136)