ప్రతి ఒక్కరు క్రింది విధముగా నుండవలెను.
1. భక్తియే మానవునకు నిజశక్తి. 2. కష్ట నష్టములు సహించుటకు సన్నద్ధుడుగా నుండవలెను. 3. సేవయే తరించుటకునావ. 4. కోరికలే మానవుని బాధించు తృష్ట, 5. జితేంద్రుడే యతీంద్రుడు. 6. దానశీలము. 7. ఆత్మగౌరవమే మానవుని అంతస్తు. 8. సదాచారశీలము. 9. ఆత్మ సంతృప్తి. 10. సద్గుణములను పంపొందించుకొనుట. 1. విజ్ఞాన సంపదను అభివృద్ధి పరచుకొనుట. 12. వివేకజ్ఞానమును అలవరచుకొనుట. 13. ఇంద్రియ నిగ్రహము. 14. కల్మషములేని సాంఘిక కట్టుబాట్లలో నుండుట. 15. సుఖజీవిని చూచి సంతసించుట, దుఃఖజీవిని చూచి జాలిపడుట అను సద్గుణము. 16. భగవంతుని యందు గాఢ ప్రేమ, విశ్వాసము, నీవే యేకైక గతియను దృఢభావము; అదే ఆత్మ నిక్షేపము. ప్రపత్తి,
(శ్రీస.సూ.9/10)
(చూ॥ భక్తిరెండు విధములు, విగ్రహారాధన)