ప్రబోధము

నన్ను గురించి ప్రబోధం చేయుటకు సాహసించవద్దు. ఎట్టి ప్రచారమూ నాకు అక్కరలేదు. నా గురించి నీకేమి తెలియును? నన్ను గూర్చి ఈ దినమున ఒక విధముగను, రేపటి దినమున మరొక విధముగను మాటలాడెదవు. నా యందు నీకు దృడ నమ్మకము లేదు. అన్నియు నీకు అనుకూలముగా జరుగుచుండిన నన్ను పొగడెదవు - లేనియెడల నన్ను తెగడెదవు. నాతో నెంతటి అనుభవ ముండినను - మాయతెర అడ్డుగా నున్నందున నా మహిమను ఏ స్వల భాగమో నీవు గుర్తింతువు - గ్రహింతువు. కావున, నా చరిత్రను నీవు వ్రాయ దలచితివేని, నీకు యధార్థంగా అనుభవమునకు వచ్చిన విషయాలను మాత్రమే వ్రాయుము. అతిశయోక్తిగా వ్రాయవద్దు. ప్రచారము చేయవద్దు.

(ప్రే.బం.పు.2)

(చూ|| పురాణము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage