"విశ్వం దర్పణ దృశ్యమాననగరీ" అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు మనస్సనే దర్పణమునందు ఒక పట్టణము వలె కనుపిస్తున్నాది. మానవుడు సాధించవలసినది ధర్మ అర్ధకామమోక్షములుకావు. అంతఃకరణ నిర్మూలనము. అంతఃకరణ పరిశుద్ధియే మానవునకు ప్రధానమైన పురుషార్థము.
(బృత్ర పు. 79)