నీటికిని నిప్పుకూ ఎట్లు పొత్తు కుదరదో అటులనే ద్వేషము నకూ భక్తికీ పొత్తు కుదరదు. ఖేదమోదములు, రాగద్వేషములు, మంచి చెడ్డలు లేకుండా, అన్నింటికినీ సమానముగ చూచువారలే నాకు ప్రియులు అని కూడనూ తెలిపెను. ఏ రూపమునైననూ సరియే ద్వేషవృత్తి అంత:కరణమునందు వుండిన, వాడు భక్తుడు కాజాలడు "వాసుదేవ స్సర్వమిదం" నమస్తము వాసుదేవుడనే భావము వుండవలెను. తన ఆత్మయే అంతటనూ, అన్నింటనూ వున్నదని తలంచి, చరించి, భావించి, దేనిని ద్వేషించిననూ తనను తాను ద్వేషించుకొన్న వాడగును. (గీ.పు.196)