నా ఉద్దేశ్యమేమిటంటే - ధనం కోసం మీరు పాటు పడకండి, బాధపడకండి. మీరు ప్రేమతో పేషంట్లకు సేవ చేయండి. మీరు ప్రేమతో పేషంట్లకు సేవ చేయండి. ఈ ప్రేమ అనేది కేవలం పుచ్చుకొనేది కాదు. Give and Take. మీరు Charge చేయండి. కాని, Treatment చేసే సమయంలో ప్రేమతో చేయాలి. ఇది సరియైన మార్గంగా ఉంటుంది. అప్పుడు అన్ని కేసులూ Success అవుతాయి మన ప్రేమను బట్టి పేషంట్స్ కూడా చాలా ఆనందిస్తారు.
కనుక-
Start the day with Love
Spend the day with Love
Fill the day with Love
End the day with Love
This is the way to God.
ఈ రకమైన ప్రేమతో మనం జీవితాన్ని గడపాలి. కొంతమంది చాలా శ్రమపడి అలసిపోతుంటారు. అది నిజమే. దానికి తగిన విశ్రాంతి కూడా ఉండాలి. మన అమెరికన్ డాక్టర్ స్వామి చెప్పినదిQuote చేసాడు. "You can t always oblige: but you can speak always obligingly" అన్నాడు. అదే విధంగా మనము మంచి మాటలను చెప్పాలి. చేసే పనులను ప్రేమతో చేయాలి. డాక్టర్లు నవ్వుతూ ఉంటే పేషంట్లు కూడా నవ్వుతూ ఉంటారు.
(స.సా మా.93 పు.66)