ఈ ప్రపంచమంతా ఒక పెద్ద హాస్పిటల్. మానవులందరూ ఇందులో రోగులుగా ఉన్నారు. కొందరు అసూయతో బాధపడుతున్నారు. కొందరు గర్వం అనారోగ్యంగా ఉన్నారు. కొందరు ద్వేషంతో నిద్రలేకుండా ఉన్నారు. కొందరు లోభంతో ఆంధులై ఉన్నారు. కొందరు స్వార్థంతో దిగజారిపోయి ఉన్నారు. ప్రతి వ్యక్తికీ ఏదో ఒక ఆనారోగ్యం ఉంది. ఈ గురుపూర్ణిమ రోజున మీ రోగాలను గుర్తించి మీకు నివారణోపాయాలను చెప్పిన డాక్టరు యెడల మీరు కృతజ్ఞులై ఉండాలి. ఆ డాక్టరు మీకు చెప్పిన మందులను ఈరోజు నుంచి వాడాలని మీరు నిర్ణయం తీసుకోండి. అంతేకాని మందుల పట్టీని కంఠస్థం చేస్తే, లేక మందుసీసా మీద ఉన్న విషయాలను రోజుకు మూడు సార్లు వల్లిస్తే, లేక ప్రతిరోజు హాస్పిటల్ కి వస్తుంటే ప్రయోజనం లేదు. మీరు కేవలం డాక్టరుని పొగుడుతూ ఆయనను పూజిస్తూ ఉంటే మీ స్థితికి జాలి కలుగుతుంది. మీరు ఆ డాక్టరు చెప్పిన మందులు వాడితేనే, ఆయన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తేనే మీరు ఆనారోగ్యం నుంచి బయటపడతారు.
(వ61-62 పు.54)