గోపాల బాల రారా
శ్రీ సాయి నాథ రారా
ఓ జంగమయ్య రారా
నీ హేమలింగ మీరా గోపాల|
పత్రిలో బ్రాహ్మణులకూ
పుత్రుండవైతి నీవూ
పక్కీరు దంపతులకు
చిక్కీతివయ్యా నీవూ గోపాల!
బాలూడవౌచు నీవూ
గోలీల నాడునపుడూ
లింగంబు మ్రింగి తివీ
లింగేశుడైతి వౌరాగోపాల |
అంగాన గొట్టి నిన్ను
లింగంబు జూపు మనగా
రంగైన నీదు లీలా
శృంగారముగను జూపి
లింగంబు జూపితీవి
ఇది ఏమి మాయ యవురా గోపాల|
తరిమేసి రయ్య నిన్ను
తల్లి దండ్రి దయనులేక
తిరిగీతివయ్య నీవూ
తిరిపెంపు వృత్తి వలన గోపాల|
నట్టడవి యందు నీవు
నాబాబురాజు నొకని
గు ఱ్ఱంబు తెరగు జెప్పి
దరిజేర్చి బ్రోచితివి గోపాల!
శిరిడి యందు నీవు బాగా
సిద్దొంది తీవి సాయీ
పుట్టపర్తి గ్రామ మందు
పట్టొందివి మరల గోపాల!
పుణ్యముల కాకరమ్ము
పుట్టపర్తి పురవరమ్ము
నరలోక పూ జ్యుడీవు
దొరపంపనరసనేలూ గోపాల!
సిరులొసగి బ్రోచునట్టి
శ్రీ సత్యసాయి దేవా
భక్తులను మరచిపోకా
దరిజేర్చి బ్రోవరావా గోపాల!
(లో పు. 53/54)