Help Ever - Hurt Never
వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు వ్రాసాడు. వీటిని చదవడానికి సమయం ఎక్కడ చిక్కుతోంది? కనుక ఈ పద్దెనిమిది పురాణాల సారాంశాన్ని రెండు వాక్యల్లో చెప్పాడు. "అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్యయం
పరోపకారయ పుణ్యాయ పాపాయ పరపీడనం"
అందరికి సహాయం చేయండి. ఎవ్వరినీ భాదించకండి. ఆదే స్వామికి ఆనందం అదే బాబాసందేశం. "అందరికీ సహాయం చేయి - ఎవరినీ బాధించకు". ఇవే మీ లక్ష్యాలు కావాలి. అపకారం ఎన్నడూ చేయకు. చేతనైనంత ఉపకారం చెయ్యు. ఇది నీ ధర్మం. "సహస్ర శీర్షాపురుషః సహస్రాక్షసహస్రపాత్" అన్ని శిరస్సులు అన్ని నేత్రాలు అన్ని పాదాలు భగవంతునివే. కనుక ఎవరిని బాధించినా భగవంతుని బాధించినట్లే అవుతుంది.
(దే.యు.పు.12)