భగవంతునికి ఒకరి పట్ల ఇష్టము, మరొకరి పట్ల ద్వేషము అనేది లేదు. అయితే, ఎవరి భావములకు తగిన - ఫలితం వారికి లభిస్తుంది. ఒక పర్యాయం పురందరదాసు చెప్పాడు - "కృష్ణా! నీవు కంసునికి యముడుగా కనిపించావు. అతని తండ్రికి దేవునిగా గోచరించావు. హిరణ్యకశిపునికి యముడుగా కనిపించావు, అతని కుమారుడైన ప్రహ్లాదునికి దేవునిగా గోచరించావు. రావణునికి యమునిగా కనిపించావు, అతని తమ్ముడైన విభీషణునికి రామునిగా కనిపించావు”. రాముడు, యముడు ప్రత్యేకంగా లేరు. అయితే, వారి వారి భావములను పురస్కరించుకొని ఒకరికి రామునిగాను, మరొకరికి యమునిగాను గోచరించాడు. (సనాతన సారథి అక్టోబరు 2022 పు 8 స్వామి దివ్య ఉపన్యాసము తేదీ 19-10-99)