ఇది మొదట చాల సుఖముగానే కనుపించవచ్చు. కాని పోతూ పోతూ ఎక్కడ దిగుతుంది?
First the man drinks the wine
Second the wine drinks the wine
Third the wine drinks the man
తాను తీసుకుంటున్నానని భ్రమిస్తున్నాడు. కాదు కాదు. అదే తనను తీసుకుంటున్నది. శాంతిని గోరి ఈ విధమైన పెడ మార్గమును బట్టి జీవితమును భ్రష్టు పట్టించుకుంటున్నారు. విజమైన శాంతి సుఖములు అనుభవించాలనుకుంటే సమాజములో ప్రవేశించు. సేవచేయి. దీనులన దిక్కులేని వారిని పోషించు. దానిలోని శక్తి కూడను అభివృద్ధి అవుతుంది. మానసిక శాంతి లభిస్తుంది. నీవు చేసిన పని మంచిదని నీ కాన్షన్స్ తృప్తి పడుతుంది.
(బ్బత్ర పు.116)