దేహము పాంచభౌతికము
దేహము కూలుట తప్పదెప్పటికి
దేహి నిరామయుండు
తొణికింపగ దేహికి చావు పుట్టుకలు
మోహనిబంధ బంధనలు ముద్రలు లేవు.
నిజముగ చూడ ఆ దేహియే దేవదేవుడు
మదిని గమనింపగ ఆత్మరూపుడై ఉన్నాడు.
పాంచభౌతికము దుర్భలమైన కాయంబు
ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
శత వర్షముల దాక మితము చెప్పిరిగాని
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో, లేక ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందో
ఊరనో, యడవినో, ఉదక మధ్యముననో
ఎప్పుడో విడిచేది ఏక్షణంలో
మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన
దేహమున్నంతలో తెలియవలయు.
(శ్రీభ.ఉ.పు. 3/4)
(చూ॥ కాయము, చదువు, విద్య)