పరుగు జీవితములే పరిపాటి కలిలోన
పరుగు లిడక యున్న పనులు చెడును
బస్సులకై పరుగు బైస్కోపులకు పరుగు పరుగు
వీడక యున్న పనులు చెడును
ఆర్థికమునకు పరుగు ఆఫీసులకు పరుగు
పరుగులిడక యున్న పనులు చెడును
పదవులకై పరుగు పగదీర్చుకొన పరుగు
పరుగు విడకయున్న పనులు చెడును
పరుగు విడరెవ్వ రీనాడు భక్తితో
అఖిల సౌఖ్యమ్ము లిడెడవధ్యాత్మమునకు?
ఇంతకన్న వేరెద్ది యెరుక పరచు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
(స..సా.వా.పు. 102)