ఎన్ని పరిణామములున్నా మానసిక పరిణామము లేనిది ఇవన్నీ నిరుపయోగములే. నైతిక పరిణామానికి సాంఘిక - పరిణామ మత్యవసరము. సాంఘిక పరిణామానికి ఆధ్యాత్మిక పరిణామ మత్యవసరము. ఆధ్యాత్మిక పరిణామమే లేకున్న పాంఘిక పరిణామము మానవద్రోహముగా పరిణమిస్తుంది. సాంఘిక నైతిక పరిణామము లకు ఆధ్యాత్మిక పరిణామమే మూలాధారము. ఈనాడు నైతిక వైజ్ఞానిక పరిణామములను పరస్పర విరుద్ధములుగా భావిస్తున్నారు. కేవలం వైజ్ఞానిక పరిణామంలో మానవ జీవితము కృత్రిమంగా రూపొందుతుంది. అందుచేతనే నేడు మానవునిలో అసూయ, దురాశ, స్వార్థము. ఆడంబరము, అహంకారములనే పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చేస్తున్నాయి. మానవుడు కేవలం స్వార్థ ప్రయోజనముల నిమిత్తమే జగత్తు నాశిస్తున్నాడు గాని, జగత్తు నిమిత్తం జగత్తు నాశించడం లేదు. కాని, ఈ స్వార్థ స్వప్రయోజన భావములను భస్మం చేసుకొన్న నాడే జగత్తు మానవత్వములకు అభివృద్ధి,
(ఆ.ప్ర.న/డి..1992 పు.26)