పరమాత్ముని మరచి ఆత్మ విశ్వాసమును కోల్పోయి పశువులవలె జ్ఞానహీనుడయి అనుభవించినంత వరకూ ఆ ఫలితమును స్మరించి తదుపరి దానికి కృతజ్ఞతేలేక క్రూరుడయి తిరుగమని సృష్టించలేదు. ప్రకృతి అంతయూ పరమాత్మ రూపముగా భావించి విశ్వసించి చక్కగా వినియోగించుకొమ్మని కూడా తెలిపెను. కానీ, ఇది నాది, అది నాది, నావారిది అని అహంకారముతో ప్రకృతిని వినియోగించుకొంటూ ప్రకృతియొక్క చట్టమును ఉల్లంఘించి తన ఇచ్ఛానుసారముగా ప్రవర్తించు వారికి ప్రకృతే తగిన ప్రాయశ్చిత్తము చేయును. పతనానికి దారితీయును.
(గీ.పు.107)
రక్తము మాంసశల్యముల రాశియు దేహము మీరు కాదు. సువ్యక్తముకాని కోరికలు వ్యర్థమనస్సును మీరు కాదుగా, ముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరు కాదు. మీ శక్తిని మీరెరుంగ గల శాశ్వితుడా పరమాత్మ మీరెగా!
(ద.స.. స.పు.1)
(చూ॥ ఆత్మ, ఆరుగుణములు, నేను, పరికరములు, పాము, బంధువు, సంపర్కము)