స్త్రీలకు పతివ్రత ధర్మము ప్రధాన లక్ష్యము. ఆసచ్ఛీల శక్తిచే వారు దేనినైనను చేయగలరు. అట్టి మహాశక్తి చేతనే సావిత్రి తన గతించిన భర్తయగు సత్యవంతునకు తిరిగి ప్రాణము రప్పించెను. ఆమె వాస్తవికముగ మృత్యుదేవునితో పోరాడెను. ఆత్రిఋషి భార్యయు, దత్తాత్రేయుని తల్లియును అనసూయ పాతివ్రత్యము అందరికి తెలిసిన విషయమే. తన పాతివ్రత్య శక్తిచే త్రిమూర్తులను గూడను పసిబిడ్డలుగ మార్చగలిగెను. నాలాయని తన కుష్టి భర్త ప్రాణమును కాపాడుటకు సూర్యుని సంచారమునే ఆపివేసెను.
పాతివ్రత్యమే స్త్రీల కొక్క శిరోమణి. లోకము చే ఎక్కువ కొని యాడబడునది స్త్రీకి ఈ లక్షణమే. ఈ శక్తినివర్ణింపనెట్టి వారికిని సాధ్యముకాదు. కానేరదు. గొప్ప విపత్తులలో పడిపోయినప్పటికిని స్త్రీ తన పాతివ్రత్య శక్తిచే సులభముగా రక్షింపబడును. స్త్రీకి పాతివ్రత్యమే జీవనము. స్త్రీ తన స్వకీయ యత్నముల ద్వారా తన్ను తాను కాపాడుకొని నిస్సంశయముగ స్వర్గమును పొందును. తన్ను బాధించ యత్నించునప్పుడు కేవలమొక మాటచే దమయంతి ఒక బోయవానిని బూదెగ దగ్ధపరచెను. రాజగు నలుడు తన సర్వస్వమును కోలుపోయి, తన శరీరము ఒంటి బట్టతో అరణ్యమున ప్రవేశించినపుడు, ఆమె సంతోషముతో పతి యిక్కట్లు పంచుకొనెను.
(ధ వాపు 28/29)