నేను నా గోళ్లను యెన్ని సార్లైననూ ఎట్లు ఖండించి వేయగలనో అట్లే నా స్థూల శరీరమును లక్షలాదిసార్లు విడనాడగలను. కాని నా సూక్ష్మ శరీరము నిలిచియే యుండును. ఇది మన భారతీయ పరమార్ధ వాహిని తెలుపు పరమ రహస్యము. ఇంకనూ విచారించిన మానవుడనగా ఒకస్థూల శరీరము, ఒక సూక్ష్మ శరీరమును, ఒక జీవుడును కూడియుండు నొక ప్రాణి. వేదాంత తత్త్వశాస్త్ర ప్రకారము జీవుడు ఈశ్వరునివలె నిత్యుడు, ప్రకృతి కూడా నిత్యమే కాని మార్పులొందుచు నిలచియుండును. ప్రకృతి మూలమగు ప్రాణాకాశ పదార్థము నిత్యమైనదే. కాని అది సర్వదా వివిధ రూపములుగా మారుచుండును. జీవాత్మ మాత్రము ఆకాశములో కానీ ప్రాణములో కానీనిర్మింపబడినదికాదు. అది భౌతిక వస్తువే కాదు. కావున అది శాశ్వతము..
(ప్ర.వా.పు. 41/42)