"కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర
నిభాననం విలసత్కుండల ధరం
సత్యం బ్రహ్మం జగద్గురుం"
సత్యమే ప్రాణము, సత్యమే తేజము, సత్యమే సర్వత్రా వ్యాపించిన బ్రహ్మము. అట్టి బ్రహ్మతత్త్వమును గుర్తించుటయే మానవత్వమునకు ప్రధాన లక్ష్యము. మానవుడనగా శరీరేంద్రియ మనో బుద్ధులతో కూడిన స్వరూపమని భావించడము జ్ఞానమే. ఇవి మానవత్వానికి ఉపాధులేకాని, మరొకటి కాదు. "రక్తము మాంసశల్యముల రాశియైన దేహము మీరు కాదు; సువ్యక్తముగాని కోరికల వ్యర్థ మనస్సులు మీరు కాదు; ముక్తికి భంగకారియగు మోహపు భావన కూడా మీరు కాదు; మీ శక్తి ద్వారా మిమ్ము సుకోగలిగిన పర బ్రహ్మమే మీరు"(.స.సా.ఆ..93 పు 207)
(చూ|| జ్యోతిశ్చరణాభిధానాత్)