"లేత వయస్సులో ఉన్న పిల్లలు లేత అరిటాకులవంటివారు. పంచేద్రియములు అరిటాకులో వడ్డించిన పంచభక్ష్య పరమాన్నముల వంటివి. వీటిని సద్భావములు, సదాచారములు, సద్గుణములనే దైవానికి అర్పించాలి. కాని, ఈనాటి పిల్లలు వీటిని దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు అనే రాక్షసులకు అర్పిస్తున్నారు."
(స.సా...2000 పు.281)
(చూ॥ ఆత్మశాంతి, నిర్వాణం)