సాధుజనులను చూచి చౌకను చేతురు
వారికేమి కొదువ వసుధయందు
కుంజరమును జూచి కుక్కలెన్నో మొరుగు
దానికేమి కొదువ ధరణియందు
కోకిల యొక్క గానము విని కాకులు ఎంతో అరుస్తాయి. అంత మాత్రంచేత కోకిల తన గానం మానుకోవడం జరగదు. హంసలను చూసి కొంగ లెంతో పరిహసిస్తాయి. అంత మాత్రం చేత హంస ఘనత ఏమీ తగ్గిపోదు. అదే విధంగా, మానవత్వం యొక్క దివ్యత్వమును గుర్తించుకున్న వ్యక్తి మానాభిమానములకు, కీర్తి ప్రతిష్ఠులకు ఏ మాత్రము లొంగడు, పొంగడు.
(ప. పా. ఏ. 99 పు. 97)