ఈ లోకములో మానవులు స్వార్థ స్వప్రయోజనాలతో, ప్రేమరహితులై ప్రవర్తించే సమయంలో ఈ శక్తి స్వరూపిణియైన ఆత్మతత్త్వము రజోగుణమును ధరించి దుర్గుణాలను నాశనం చేసింది. ఇదియే "దసరా" పండుగ యొక్క అంతరార్థము. ఈ విధముగా దుర్గుణాలను నిర్మూలించినప్పుడు దేవి మహా రౌద్రాకారమును ధరించింది. ఈ దేవి యొక్క ఉద్రేకాన్ని చల్లార్చే నిమిత్తమై ఆమె సంతతి వారైన స్త్రీలందరూ ఎఱ్ఱ కుంకముతో అర్చనలు గావించారు. దీని అంతరార్థమేమనగా - ఆ తల్లి ఈ రక్త వర్ణంతో కూడిన కుంకుమను చూచి దుర్మార్గులందరూ అణగిపోయారని తలంచి, శాంత పడుతుందట. కనుక, ఈ కుంకుమపూజ దేవి యొక్క రౌద్రాన్ని చల్లార్చే నిమిత్తమై జరుపబడుతుందని దీనికి అర్థము .
(స.పా. న. 91 పు. 306)