ఒకానొక సమయంలో కుంతిదేవి తనకు జీవితమంతా కష్టాలనే ప్రసాదించమని కృష్ణుణ్ణి ప్రార్థించింది. "కృష్ణా! కష్టాల్లోనే నిన్ను స్మరించడానికి వీలౌతుంది. పాండురాజు జీవించియున్నప్పుడు, సుఖసంతోషాలను అనుభవిస్తున్నప్పుడు నేను ఏనాడూ నిన్ను స్మరించలేదు. పాండురాజు గతించిన తరువాత కష్టసమయమందే నిన్ను అనేక పర్యాయములు స్మరిస్తూ వచ్చాను. కాబట్టి, కష్టములే నాకు మంచివనిపిస్తోంది. నేను ఎన్ని కష్టములనైనా అనుభవించానికి సిద్దమే. కాని, నీ ప్రేమ మాత్రం కించిత్తానా చలించకూడదు. నిన్ను మరువని భక్తిని, కష్టాలను అనుభవించే శక్తిని నాకు ప్రసాదించు" అని కోరింది. ఆమె తన ప్రాణమంతా కృష్ణునిపైనే పెట్టుకొంది. పాండవులు అనుభవించిన కష్టాలు ఎవ్వరూ అనుభవించలేదు. కనుకనే, వారు నిరంతరము దైవసన్నిధిలో నిలువగల్గారు.
(స. సా. ఫి. 2000 పు. 43)
(చూ॥ భక్తుని లక్షణం)