ఆ కాళింది మడుగు ఎక్కడో లేదు. మీ మనసే మడుగు! ఆమడుగులో ఆరుతలల పాముంటుంది. కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరూ ఆ పాము పడగలు. మీరు చేసే భగవన్నామమే మనసనే మడుగు అడుగున ఎక్కడో దాక్కున్న ఆ పామును బయటికి లాగి భంగపరచే బాలకృష్ణుడు!
కృష్ణుడు కాళీయునిపై కెక్కిపడగల పై నాట్యం చేశాడు. అప్పుడు కాళీయుని గర్వం నశించింది. మీలోని పరమాత్మను కూడ కామక్రోధాదుల పడగలపై కెక్కి, ఆడమని వేడండి! అప్పుడు గాని, ఆ పాముతన విషాన్ని కక్కి వేసి, సాత్విక మై కూచోదు.
(శ్రీ.సా.గీ.పు.99)