జీవితంలో కష్టసుఖాలు కావడికుండల్లా వుంటాయి. ఒకటి లేక మరొకటి వుండదు. సంతోషానికీ, సంతోషానికి మధ్య విచారం, విచారానికీ, విచారానికీ, మధ్య సంబరం. గులాబీ వెంటనే ముల్లుంటుంది. సాధకుడు ముల్లు తగలకుండా గులాబీవి కోసుకోవాలి. తేనిటీగలు కుట్టకుండా తేనె తీసుకోవాలి. అడ్డంకులకు భయపడి నీ దారి నుండి తొలగరాదు. సాహసంతో ముందుకు సాగు.
(శ్రీ.సా.గీ.పు. 73/74)