"కామమనే పిశాచము నశించగానే ప్రేమ అనే దేవత ఉద్భవించుతుంది. ఇదే విభూతి యొక్క విశిష్టత, పుట్టి నశించే ప్రతి పదార్థము యొక్క ఆఖరి దశ యీ బూడిద". "నీవు బూడిదలోనుండి వచ్చినావు తిరిగి బూడిదలో చేరుతున్నావు."(శ్రీసి. ది. లీ. పు. 22)
కామమనగా లభించే అవకాశం దాని చిహ్నములు కనిపించకున్ననూ, లేకపోయిననూ వస్తువులు కోరే ఆశను కామమందురు.(గీ. పు. 108)
(చూ|| త్యాగము, పురుషార్థము, మంచితనము, రక్కసి)