ఈనాడు ఎక్కడ చూచినా (Cancer) అనే వ్యాధి ప్రబలంగా ఉంది. దీనికి కారణమును గుర్తించలేకున్నారు. దీనికి ఔషదమును కనిపెట్ట లేకున్నారు. దీనికి ఔషధము లేకపోలేదు. అయితే దీనిని చెపితే హాహ్యస్పందంగా ఉంటుంది. మీ కందరికీ తెలుసు. మన ప్రధానమంత్రి రోజూ తన మూత్రమును తానే స్వీకరిస్తారు. ఇది Cancer కు సరియైన మందు. దినమునకు కొన్ని ఔన్సులు తీసుకుంటే వ్యాధి నివారణ అవుతుంది. అయితే కాన్సరు లేని వారు తీసుకోనక్కరలేదు. ఈ కాన్సరు వ్యాధికి మూలకారణము పొగాకు. ఈ పాగాకులో ఒక్కొక్క ఆకులో క్రింది భాగమున అంచులలో కాన్సరు పురుగు లుంటాయి. పూర్వకాలములో మనవారు ఆ కాన్సరు పురుగులున్న భాగము తీసివేయటం చేత ఆ పురుగులు వేరు పర్చటం జరిగేది. కానీ ఈనాడు ఈ విధంగా ఆకులను కత్తిరిస్తే, ఆకు విలువ తగ్గిపోతుందని అట్లా చేయడంలేదు. అందువలన కాన్సర్ క్రిములలోనే చుట్టలు,బీడీలు, సిగరెట్లు తయారవుతున్నవి. అవి త్రాగే వారికి, ముక్కుపాడి పీల్చేవారికి, త్వరగా గొంతులో, ఊపిరి తిత్తులలో కాన్సరు వ్యాధి వచ్చే అవకాశములున్నాయి. ఇది మీరు చక్కగా గమనించాలి, మన ఆరోగ్యము కంటే. మనము ఆనందముగా జీవించడానికంటే, మనకు కావలసినదేమి లేదు. మన జీవితమును సార్థకము చేయాలనుకుంటే తక్షణము యీ దురభ్యాసమును దూరం చేయాలి. ఈ విధంగా ఆహార విహారములను గురించి మీరు తెలుసుకుని అందరికి తెలపాలి.
(శ్రీ.స. ది. పు. 96/97)