మానవత్వాన్ని పశుత్వంగా అనుభవించటం మానవత్వానికి కళంకం. కామక్రోధ లోభ మొహమదమాత్సర్యములనే అరిషడ్వర్గములు మానవుణ్ణి హతమార్చి వేస్తున్నవి. వేదము "చంద్రమా మనసో జాత: చక్షుస్సూర్యో అజాయత” అన్నది. చంద్రునికి పదహారు కళలు. ఈ పదహారు కళలు పూర్ణమైన స్థితిని పొందినప్పుడే తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతినిలో కాంతినందిస్తుంది. చంద్రుడు పదహారు కళలను పెంచు కున్నప్పుడే జగత్తుకు చక్కని ఆదర్శం. మానవుని యందు పదహారు గుణములున్నాయి. కాని ఈ పదహారు గుణములను నిర్మూలము చేసినప్పుడే మానవత్వా అరిషడ్వర్గములుఆరు, మదములు ఎనిమిది. రజస్తమోగుణములు రెండూ చేరిస్తే పదహారుగుణములౌతాయి. వీటిని నిర్మూలము గావించు కోవాలి. కర్తృత్వ భోక్తత్వాలను తగ్గించుకోవాలి. అన్ని విధములా భగవంతునికి అర్పితంచేసి సర్వం బ్రహ్మమయమనే స్థితిలోపల సత్కర్మలు ఆచరిస్తూ పోయినప్పుడు సర్వము భగవంతుడే సహాయపరుస్తాడు.
(బ్బ.త్ర. పు ౧౭౩})
మనిషికి 16 గుణాలు. వీటినే ఆధ్యాత్మికమందు షోడషకళలు అన్నారు. ఈ పదహారు కళలు ఏమిటి? ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఉద్భవించిన పంచభూతములు, మనస్సు ఒకటి - ఇవే పదహారు కళలు. కేవలము భగవంతుని యందే పదహారు కళలుంటున్నాయని భావించటము వెట్టితనము. ప్రతి వ్యక్తి పదహారు కళలతో వుంటున్నాడు. "ఈశావాస్యమిదంసర్వం" అని "ఈశ్వరస్సర్వభూతానామ్" అని ఈశ్వరుడు సర్వత్ర ఉంటున్నాడు.
(బృత్ర, పు. ౧౧౫)
కళలలోన కలుగు కాంతియె దేవుడు
పిలుపు లోన కలుగు ప్రియము నతడె
మేధయున్న దనుచు మీరకు దైవాజ్ఞ
కూలద్రోయబడును కుత్సితుండు.
(భ స ప్రపం. పు. 16)
కృష్ణావతారం పదహారు కళలు నిండినటువంటి సంపూర్ణావతారం. రాముడు తన కళలను సోదరులలో పంచుకున్నాడు. రాముడు గుణసహితుడు. కృష్ణుడు గుణరహితుడు. ఎటువంటి విపత్తు వచ్చినా కృష్ణుడు ప్రార్థించలేదు. రాముడు ఆదిత్యుని ప్రార్థన చేశాడు. కృష్ణుడు గుణాతీతుడు కాబట్టి గోపికలతో ఆయన సంబంధం పవిత్రం. స్వచ్ఛం. అందువల్లనే ధర్మజుడు రాజసూయయాగ సందర్భంలో ఆనాటి ఋషులనూ యోగులనూ కాదని కృష్ణునికి ప్రత్యేక పూజలు సమర్పించాడు.
(వ. 1963 పు. 191)
(చూ|| కృష్ణతత్వము, పురుషుడు) |