మీ శరీరము, మనస్సు, బుద్ధి అంతా ఒక కల. మీరంతా సచ్చిదానంద స్వరూపులు. మీరె ఈ జగత్తు అంతా సృష్టిస్తున్నారు. మీరే ఈ జగత్తులో పరమేశ్వరస్వరూపులు. మరల సంహరిస్తున్నారు.
(సా|| పు. 522)
నేనొక విషయము చెప్పెదను. భగవంతునికి సంబంధించిన కలలన్నియు నిజమే. మీరు నన్ను కలలో చూతురు. నేను మీకు నమస్కరించు అవకాశమిత్తును, మిమ్ములను ఆశీర్వదింతును. నా అనుగ్రహము అందింతును. ఇవన్నియూ నిజమే. అది నా యొక్క ఇచ్చ. మీ యొక్క సాధనాశక్తి వలన సంభవించును. భగవంతుడుగాని, మీ గురువుగాని కలలో కనిపించిన అది నా సంకల్పము వలననే కాని, ఇతర కారణములవలన కానేరదు. మీ ఇచ్చ వలన అది ఎన్నటికీ జరుగదు.
(స.సా ॥ మే 1992, పు. 101)
(చూ॥ మదాలస)