జీవితంలో ఏది సాధించాలన్నా మానవ ప్రయత్నము అవసరం. గత ఇరవై సంవత్సరాలుగా ప్రశాంతి నిలయములో భక్తులకు వసతి సౌకర్యములను పెంచి అనేక సదుపాయములను కల్పించిన ఘనత జోగారావుకు దక్కుతుంది. గత ఇరవైయేళ్ళుగా సత్యసాయి సెంట్రల్ ట్రస్టులో సభ్యునిగా ఉన్న జోగారావు విసుగు, విరామం లేకుండా రాత్రింబగళ్ళు శ్రమించి ప్రశాంతి నిలయంలో ఈ సదుపాయములను సమకూర్చడానికి కృషి చేశాడు. అతడికి పని అంటే ఇష్టము. అంతేకాదు, గత పన్నెండు నెలలుగా రాత్రింబగళ్ళు నిర్విరామంగా అతడు ఏమి చేస్తున్నాడో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అతడు కల్నల్ జోగారావు కాదు - కర్మజోగి"
(దై. ది. పు.339)