దేవతలనుద్దేశించి హోమము చేయబడునది. అంతమాత్రమే గాక దేవతా ఆహ్వాన రూపమని విశేషార్థము. స్వాహాకార వషట్కార పూర్వకము కాని ఆహూతులు దేవతలకు చెందనే చెందవు. సరస్వతి శబ్దము ఒక దేవికని, వేదవాక్కునకు ప్రసిద్ధము. అంతేకాదు. ఆత్మను గురించి చెప్పునది కనుక స్వాహా అని అర్థము. దేవీ భాగవతమునందు పరదేవతయే గాయత్రి అనియు స్వాహా ఆనియు చెప్పబడినది. లలితా సహస్రనామములో పరాదేవత, స్వాహా, స్వధా అను శబ్దములలో పేర్కొనబడినది. స్వాహా అను శబ్దము హవిర్ధాన వాచకము కూడా,
(లీ.వా. పు. 22, 23)