పంచ భూతముల యొక్క సమిష్టి స్వరూపమే అంతః కరణకు శబ్ద స్పర్శరూపరసగంధములు అన్నీ అనుభవించే అధికారముంటున్నాది. అంత:కరణము శబ్దస్పర్శరస గంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినది. జ్ఞానేంద్రియములు దేహమునకు వెలుపలివా లోపలివా అని విచారిస్తే ఇవి ఆంతర్బహి స్వరూపాలు. కర్మేంద్రియమైన చెవి మాత్రమే వుంటుంది. జ్ఞానేంద్రియమనే వినుశక్తి లేకపోయినప్పుడు చెవివుండి ప్రయోజనము లేదు. జ్ఞానేంద్రియమనే విను శక్తి వుండి కర్మేంద్రియమనే చెవి లేకపోతే వినలేదు.
జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సమ్మిళితమైన స్వరూపమే యీ వ్యష్టి తత్వము.
సత్వగుణము యొక్క పంచభూత స్వరూపమైనది అంతఃకరణ అయితే రజోగుణము యొక్క పంచ భూతముల యొక్క సమిష్టి స్వరూపము ప్రాణముగా నిల్చింది.
రజోగుణము సృష్టియందు పంచభూతములందు వ్యష్టిస్వరూపమైన ఆకాశము యొక్క బిందువు కన్నురెండవ భూతమైన వాయువు యొక్క వ్యక్తి స్వరూపమైన బిందువు చేయి. రజోగుణవ్యష్ష్టియందు మూడవదైన వ్యష్టిస్వరూపము అగ్ని. వ్యక్తి స్వరూపమైన అగ్ని యొక్క సృష్టి కాలు. నాలుగు ఐదు అయిన గాలి. ప్రకృతుల వ్యష్టి సృష్టి మలమూత్రములు విసర్జించు ప్రదేశములు.
సత్వగుణ సృష్టియందు వ్యష్టి సృష్టిగా వచ్చిన ఆకారముయొక్క మొదటి సృష్టి చెవి. రజోగుణమునందు వ్యష్టి సృష్టి ఆకాశము యొక్క సృష్టికన్ను. ఏతావాతా ఆకాశమునకు యిద్దరు బిడ్డలు. రజోగుణము ... వాక్కు, సత్వగుణము బిడ్డ చెవి. రెండవ బిడ్డ వాక్కు. మొదటి బిడ్డయైన చెవి బయట విషయాన్ని లోపలి స్వీకరిస్తుంది. రెండవ బిడ్డయైన వాక్కు స్వీకరించిన దానిని బయటకు విడిచిపెడుతుంది. సత్వగుణము యొక్క వాయువు
యొక్క బిడ్డ చర్మము. రజోగుణము యొక్క వాయువు బిడ్డచేయి. ఎక్కడైనా దేహము పైన చీమ పారాడుతూవుంటే చర్మము స్పర్శ తెలుసుకుంటుంది. తెలుసుకున్న తక్షణమ్ చేయి తీసి పారవేస్తుంది. ఏతావాతా సత్వగుణము యొక్క అంశములు స్వీకరించటము, రజోగుణము యొక్క సంతతి దానిని విసర్జించటము. ఈనాడు లోకము ఏరీతిగా వున్నదంటే రజోగుణము స్వీకరిస్తూవుంది. దీనిని వుల్టా సీదా అంటారు. విరుద్ధముగా నడుస్తూ వస్తుంది. సృష్టి రహస్యము.
విజస్వరూపము సత్వగుణము మాత్రమే స్వీకరించాలి. రజోగుణము తత్వము విసర్జించాలి. ప్రకృతికి సత్వగుణమే మొట్టముదటి పదము. ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు. స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినది. మొదట సాత్వికము స్వీకరించాలి. రెండవది తమోగుణము అనగా మర్యాద వినయముగా అణుకువగా వుండే గుణములు అభివృద్ధి పరుచుకోవాలి. రకారము రాజసము. అనేది కట్టకడపటిది.
(బృత్ర.పు.112/113)