ఇటుకతో సున్నంతో కట్టిన - దేవాలయంలో రాతితో చేసిన విగ్రహంలో దివ్యత్వం చూడ దలచుకున్నారు మీరు. అంతకంటే సులభంగా నడిచే మనిషిలో దైవాన్ని చూడగలరు - నరునిలో నారాయణుని చూడటం మొదటి మెట్టు - పిదప ఆలయంలో ప్రతిమలో దేవుని చూడగలరు. మానవుని గౌరవిచండమే దైవారాధనకు మొదటి మెట్టు.మానవుడు ప్రత్యక్షం - దైవం పరోక్షం.
(త.శ.మ.పు. 147)
"సమాజంలో ప్రధానమైన ఆలయములు నాలుగు1.విద్యాలయం 2.వైద్యాలయం3.భోజనాలయం4.దేవాలయం,విద్యాలయంలోవిద్యకుసంబంధించిన విషయాలనే మాట్లాడుతాము. వైద్యాలయంలో ఆరోగ్యము, మందుల గురించే చర్చిస్తాము. భోజనాలయంలో తిండి ప్రసక్తి తప్ప మరొకటి ఉండదు. అదేవిధంగా, దేవాలయానికి వెళ్ళినప్పుడు జనం దైవానికి సంబంధించినవి మాత్రమే చర్చించాలి. కాని, దురదృష్టవశాత్తు ఈనాడు జనులు దేవాలయంలో దైవసంబంధమైన విషయాలు తప్ప అన్నింటినీ ఆలోచిస్తున్నారు. చర్చిస్తున్నారు. పూర్వం దేవాలయాల గోపురాలను ఎత్తుగా కట్టేవారు. ఎందుచేత? ఊరికే డబ్బులున్నాయనా? కాదు, కాదు. ఆగోపురాలను చూసి నప్పుడల్లా ఊరిలోని జనులకు దైవం జ్ఞాపకం రావాలనే సదుద్దేశ్యంలోనే గోపురాలను ఎత్తుగా నిర్మించేవారు."
(స.పా.ఏ.96 పు.100/101)
(చూ॥ నాలుగు ఆలయాలు)