వేదము ఋషి యగుటయేకాక ఋషి ద్రష్ట అగుటచే ఇది ఆర్ష అని చెప్పబడినది. ఈ వేదమంత్ర జాతము ఆర్షయధీనమని ఋగ్వేదము స్వయముగా వివరించినది. ఇంతేకాదు. సకారన్త పదము వేద బ్రహ్మకు మరొక నామము. దానికి వేదః అనగా ధనము, జ్ఞానము లేక పరమైశ్వర్యము అని అర్థములు.
లౌకిక ధనము కంటె వేదమాతా ప్రసాదరూప మగునట్టి ధనమే విలక్షణమై పురుషార్ధ సాధకమగును. దీనినే పరమైశ్వర్య జ్ఞానము అనికూడా అందురు. ఇది వేదరూప బ్రహ్మమును దర్శింపచేయును.
దీనినే వేదములో కూడా దేవా! నీవు వేద స్వరూపుడవు పశుపుత్రాది ధనముతో లేక పరమైశ్వర్యముతో, జ్ఞానముతో నన్ను నిoపుము. అట్టి ధనముతో నేను తృప్తుడనగుదును. ఆ ధనము ఏ కైంకర్యమునకు వినియోగింపబడినది అగుటచే నీవునూ తృప్పుడగుదువు అని ప్రార్థించిరి వేదఋషులు.
(లి.వా. పు. 16, 17)
(చూః ప్రథమజా)