మానవుడు ఆనందపిపాసి. మానవుడు నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు. దుఃఖమును యేమాత్రము ఆశించడు. నిరంతరము లాభమునే ఆశిస్తాడు. కాని నష్టమును ఆశించడు. కారణము? ఆనందమే యితని స్వభావము. వ్యాపారులు యేదైనా ఒక తూనిక వేస్తూనో, లేక కొలతలు వేస్తూనో మొట్ట మొదట ఒకటి, ఒకటి యని వారు ఎంచరు. లాభం, లాభం, లాభం అంటూ లాభంలో ప్రారంభిస్తారు. ఆరో అంకె దాటి పోయేటప్పటికి యేడు అని చెప్పరు. ఆరునోక్కటి, ఆరునొక్కటి, ఆరునొక్కటి అంటారు. ఏడు అనరు. ఏడు అంతా దుఃఖము. దు:ఖమును ఆశించడు. దీనిలో వున్న అంరార్థము యేమిటి? ఈ యేడు అనే తెలుగు పదము వుపయోగపెట్టటానికి యిష్టముండదు. ఆరునొక్కటి అంటున్నాడు. ప్రారంభములో లాభము. మధ్యలో ఆనందము.
ఈజగత్తుఆనందము.ఇంద్రియానందము,విషయానందముహృదయానందములనుండిఆవిర్భవిస్తున్నాది.ఇట్టిఆనందముబ్రహ్మస్థాయి నుండి లభించుచున్నది. కనుకనే దీనికి బ్రహ్మానందమని పేరు. ఇంద్రియ విషయానందముల కంటె అనేకరెట్లు అధికమైన ఆనందమును చతుర్ముఖానందము అన్నారు. చతుర్ముఖానందము అనేది బ్రహ్మానందసాగరములో ఒక బిందువువంటిది. ఈ బ్రహ్మానందమనే మహాసాగరము దైవానందములో ఒక్క అణుమాత్రమే వుంటుందట. కనుకనే దైవానందమనేది ప్రధానమైనది, నిజమైన హృదయానందము. ఈ హృదయానందము సర్వత్ర ప్రకాశించే దేదీప్యమానమైన జ్యోతి.
(శ్రీ గీ.164 - 166)
(చూ||బొమ్మలాట, స్వస్థానము)