1. ప్రతిరోజు నియమిత కాలంలో జపధ్యానాలు చేయటం,
2. ప్రతివారం ఒక రోజయినా కొద్ది సేపు కుటుంబ సభ్యులతో భగవన్నామ సంకీర్తన చేయటం.
3. కుటుంబంలోని పిల్లలను బాలవికాస్ తరగతులకు పంపటం.
4. సేవా కార్యక్రమాలలో గ్రామీణ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం.
5. భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసంస్థలు నిర్వహించే సంకీర్తన, నగర సంకీర్తనలలో నెలకొకసారి అయినా పాల్గొనటం.
6. సాయి సారస్వతం చదవటం, ప్రతిరోజు అధ్యయనం చేయటం.
7. మృదువుగా మాట్లాడటం..
8. మనుషుల వెనుకవారిని గూర్చి చెడుగా ప్రస్తావించటాన్ని మానుకోవటం.
9. ఆహారం పారవేయకూడదు. ప్రతిరోజు కొన్ని బియ్యం గింజలను "నారాయణ సేవ” కోసం దాచి వుంచుతూ, నెలకొకసారి అయినా నారాయణ సేవ కోసం ఆహారం తీసుకు వెళ్ళటం.
(సే.యే.పు. 16/17)