పుణ్యం పాపాన్ని క్యాన్సల్ చేయదా? అన్న ప్రశ్నకు బాబా మీరు ఎకౌంట్ స్టూడెంట్స్ కదా. అందుకని ఇలా అడిగారు. మీ ఆలోచనంతా క్రెడిట్, డెబిట్లలోనే ఉంటుంది. కానీ, భగవంతుడు మీ కన్నా గొప్ప ఎకౌంటెంట్. ఆయనది మీవంటి బ్యాలన్స్ షీట్ కాదు. పుణ్యానికి పుణ్యాన్ని, పాపానికి పాపాన్ని అనుభవింప జేస్తాడు. దేంట్లోంచి దేన్ని మైనస్ చేయడు. ఒక చిన్న ఉదాహరణ: మీరు ముండ్ల చెట్టు విత్తనాలను, పండ్ల చెట్టు విత్తనాలను తెచ్చి నాటినారనుకోండి. ఏమవుతుంది? ముండ్ల చెట్టు విత్తనాలు ముండ్ల చెట్లుగాను, పండ్ల చెట్టు విత్తనాలు పండ్ల చెట్లుగాను పెరుగుతాయి. అందుకు విరుద్ధంగా
జరుగదు కదా. పాపపుణ్యాల విషయంలో కూడా అంతే. ఒకడు ఎన్నో దుష్కర్మలను చేసి, పది లక్షల సంపాదనను ఆశించి, వేంకటేశ్వర స్వామికి పదివేలిస్తానని మొక్కుకున్నాడట. తనకు పది లక్ష లివ్వగలిగిన స్వామి తన నుండి పదివేలు ఆశించడనే ఆలోచన వానికి రాలేదు. ఈ విధంగా, కొంతమంది ఆధ్యాత్మికంలో కూడా లౌకికాన్ని ప్రవేశపెడతారు. కానీ, లౌకికాన్ని కూడా ఆధ్యాత్మిక మయం చెయ్యాలన్నది స్వామి సందేశం.
(స. సా.. జాన్. పు.192/193)