చూచితే దైవాన్ని చూడవలెనేగాని
వేరు చూపులు చూడ వెఱ్ఱితనము
నడచితే వైనముతో నడవవలెను గాని
వేరు మార్గము నడవ వెఱ్ఱితనము
పలికితే సత్యాన్ని పలుకవలెనేగాని
వేరు పలుకులు పలుక వెఱ్ఱితనము
పాడితే తత్యాలు పాడవలెనే గాని
వేరు పాటలు పాడ వెఱ్ఱితనము
విన గోరిన హరిభజనలు వినగవలయు
చూడ కోరిన దైవాన్ని చూడవలయు
చేరవలసిన దైవాన్ని చేరవలయు
ఇంత కంటెను పరతత్వమేమి కలదు?
సాధు సద్గుణ గణ్యులే సభ్యులారా!
(శ్రీ.వ.1991 పు.81)