వెదకుచున్నాను! వెదకుచునే యున్నాను
వెదకుచుంటిని ఆనాడునేడు: నిజమానవ విద్యార్థిని!
నరులు గలరు 5 నూ రు కోట్ల జగతిలోన
నర రూపములనే, చూచితిని నిజరూపమును గాంచనైతిని!
వెదకుచున్నాను నేను! వెదకుచునే యున్నాను!
వెదకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని,
బూరగకాయను చూచి మామిడి యని భ్రమిసినట్లు
వెర్రిచెఱకు కర్రను చూచి చెఱుకనని తానమ్మినట్లు
కణికిరాయి రూపుచూచి, కలకండని నమ్మినట్లు
రూపమును చూచి మోసపోకు గుణేశ్వరుని నిజరూపము!
(పా. పు. 119/120)