అర్జునుని విషాదంలో మొదలవుతుంది. కాబట్టి భగవద్గీతలో ప్రథమాధ్యాయాన్ని విషాదయోగం అన్నారు. కాని నిజానికది విషాదం కాదు, విచారణ. ఈ యుద్ధం అసలు ఎందుకు చేయాలి? ఎవరికోసం? ఎవరిసుఖం కోసం ఈ యుద్ధం చేయవలసి వస్తోందో, వారంతాయుద్ధం చేసి చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితులలో ఈ యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అని విచారణ సలిపాడు అర్జునుడు. అందువలన ఈ గీతలోని ప్రధమాధ్యాయమును "విషాదయోగం" అనే బదులు "విచారణయోగం" అంటే సమంజసంగా ఉంటుంది.
(శ్రీభ.ఉ.పు.2)