ఆత్మ (రేడియేషన్)

ముందు లేకుండి తరువాత కలుగుట జన్మమని అందురు. ఉండి లేకపోవుట మరణమని అందురు. జన్మము సావయవ వస్తువులకే కాని విరవయవ వస్తువుకు కాదు! ఆత్మ  నిరవయవం కదా! కనుక ఆత్మకు జన్మమెక్కడిదిఅట్టి జన్మమే లేనిదానికి మరణము యెట్లు సంభవించునుఅట్టి ఆత్మ  యెవరిని చంపునుయెవరిని చంపించునుఅది అజమునిత్యముశాశ్వతముమలినమైనజీర్ణమైన వస్త్రములను మనుజుడు విడిచి  నూతన శుభ్రమైన వస్త్రములను యే రీతిగా ధరించునో అటులనే దేహి జీర్ణములైన దేహములను వీడి నూతన దేహములను ధరించుచున్నది. వస్త్రము దేహమున కెట్టిదో,దేహము దేహి కట్టిది. దేహములకు సా క్షియైన ఈ ఆత్మను తత్వతః తెలిసి కొనినచో నీవు ఈ రీతిగా శోకించి యుండెడి వాడవు కావు. నీ సర్వాయుధములు ఈ శరీరములను జడములను కొట్టగలవే గాని నిర్వకారమైన ఆత్మను యే రీతిగానూ సమీపించలేవు. ఈ సత్యమును తెలిసి కొని శరీరమందలి శోకమును త్యజించుము. .

(గీపు.32)||

 

ఆత్మకూ చావుకూ ఎట్టి సంబంధం లేదు. మరణము యొక్క అనుభవము దేహమువకే కానీ నిత్యసత్యనిర్మలమైన ఆత్మకు అంటడు. అందువలననే మరణమున్న యిష్టపడదుఇష్టపడనిది ఆత్మకాని దేహము కాదు. మరణమన్న యేది ఇష్టపడకుండా వున్నదో ఆ ఆత్మే నీవు. నీవు సత్స్వరూపుడవు. దేహము పై ఆరోపించే అమరధర్మం అవివేకము. దేహము సత్ కానేకాదు. ఆ సత్ పేరున నున్న  నీవే ఆత్మ కాని ఆత్మకు మరణము రాదులేదు. అట్టి మరణము లేని ఆత్మసర్వ ఉపాధులందూ వుండును. కనుకప్రతి దేహము లోనూ సత్ పదార్థశక్తి సార్థకమైయున్నదని తేట తెల్లమగుచున్నది. ఇక రెండవదైన చిత్ అన్నింటినీ తెలిసికొనవలెనను శక్తిప్రతి మానవుడు దేనిని చూచినను ఇది యేమిఅది యేమిఅని ప్రశ్నించి దాని స్థితిగతులను తెలిసికొనగోరుము. ఆవిధముగా ప్రయత్నించి దీనిని తెలుసుకొనువారు కొంతమంది ఉండవచ్చును. కేవలము తెలుసుకొనవలెనని మాత్రము ఆశించిప్రయత్నించి తెలుసుకొన లేకుండా పోవచ్చును. ఎటులయిన నేమి ప్రతివాడూ తెలిసికొన వలెనని ఆసక్తితో. ప్రయత్నము సలుపును.

 

స్వయముగా చైతన్యమైన చిత్ శక్తికి జడవస్తువులను కూడా చైతన్యవంతముగా ప్రకాశింపచేసే స్వభావము సహజముగ వున్నది. అందుకనే ఈ లక్షణము మానవునియందు మెరయుచున్నదిమెరిపించు చున్నది. మానవునియందు చిత్ శక్తి వున్నదనుటలో పై విషమయు విచారించిన స్పష్టమగుచున్నది.

 

మానవుడే కాక పశు పక్షి మృగాదులు కూడనూ తమంతట తాము సుఖముగా వుండవలెననియే కోరు చుండును. సుఖమునకై ప్రయత్నములుకూడనూ చేయుచుండును. దుఃఖమునుకాని కష్టమునుకాని అవి ఆశించవు. వచ్చిననూ తప్పించుకొనుటకు ప్రయత్నించును. ఇక మానవుల విషయము తెలుపనక్కరలేదు. నిరంతరము సర్వకర్మల యందు సర్వత్రా సుఖముగానే యుండవలెనని కోరుదురు కానీ ఒక సమయమందైనావేరొక స్థాన మందైనావేరొక కాలమందైనా దుఃఖమును ఆశించరు.

(గీ..పు. 127/129)

 

ఆత్మ అతి సూక్ష్మమయినది: దానిని తెలుసుకొనుట చాలా కష్టము. పంచభూతములను భూమిజలము అగ్నివాయువుఆకాశముఇవి నీకు తెలియును కదా! ఇవి మొదటినుండియూ విచారించిన వకదానికంటే మరొకటి తేలిక ఆగుచున్నది. అనగాభూమికంటే జలముజలముకంటే అగ్నిఅగ్నికంటే వాయువువాయువు కంటే ఆకాశము తేలిక అగుటయే కాక విశాల మగుచున్నది కూడనుఅనగా భూమియందున్న గుణములు శబ్దస్పర్శ రూప రస గంధములనబడు అయిదు గుణములు: రెండవదనబడు జలమునందు గంధము తగ్గిపోయినదిఅగ్నియందు గంధము రసము తగ్గిపోయినవి: వాయువునందు రూప రస గంధములు తగ్గి పోయినవి. అందువలన భూమికంటెను. జలముకంటెనుఅగ్నికంటెను మరింత తేలిక అయి వ్యాపకమయి సంచరించుచున్నది. ఇక అయిదవదయిన ఆకాశమున స్పర్శరూపరస గంధములు లేక కేవలము ఒక శబ్దము మాత్రమే యున్నది. ఒక్క గుణముగల ఆకాశమే అంత సూక్ష్మమయి నపుడు నిర్గుణ మై న   ఆత్మ మరెంత సూక్ష్మమో యోచించుకొనలేక పోవుచున్నావు. అంత సూక్ష్మమగుటచే బహిర్ముఖమున తెలిసికొన లేకపోవుచున్నారు. అది అంతర్ముఖులకు మాత్రమే అతి సమీపమున నుండును.

(గీపు. 217/218)

 

సూర్యుని వేడిమినుంచి ఏర్పడిన మేఘ సముదాయము. సూర్యుని కప్పివేసినట్టుగాఆత్మ నుండి పుట్టిన మానసిక మేఘసముదాయము ఆత్మనే కప్పివేస్తుంది.

(బృ,త్రపు ౧ ౩౫)

 

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత

అహ మాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ.

 

అర్జునా! నేను ఆత్మను. సర్వభూతములయందుండిన వాడను నేను. ఆది మధ్య అంతము నేనే. ఈ చరాచర ప్రపంచమునందు గోచరించునదంతయు ఆత్మ తత్వమే. ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడునా వినిపించునది కనుపించునది. అనిపించునది మైమరపించునది ఆత్మనే. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు. ఈనాడు మానవుడు సాధించవలసినది ఆత్మనిష్టనే. స్వస్వరూపాను సంధానమే ఆత్మనిష్ఠతనను తాను గుర్తించుకోవటమే ఆత్మ జ్ఞానము. మానవత్వమునందు ప్రప్రథమముగా సాధించవలసినది ఆత్మానందమే. నిరంతరము జ్ఞప్తి యందుంచుకోవలసినది ఆత్మ తత్వమే. ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.

(బృత్రపు౧౨౩ )

 

ఈ పాంచ భౌతికమైన దేహము బుడగవంటిది. ఈ దేహమునందు ఆత్మ అణుస్వరూపము ధరించుట చేతదేహత్మ అన్నారు. ఈ సర్వ చైతన్యముసమస్తములైన పదార్థములను కదిలిస్తుంది. దేహముజీవుడు పరమాత్మఅను 3 తత్వములున్నాయి. కాని దేహత్మజీవాత్మపరమాత్మ -ఆత్మ మూడింటి యందు ఒక్కటిగనే యున్నది.

(సా. పు. 287)

 

ఈగ అన్నింటిపైన వ్రాలుము. అగ్ని పై మాత్రము వ్రాలదు. వ్రాలిన జీవించదు. అటులనే మనసు అన్నింటిని చింతించును. ఆత్మను మాత్రము చింతించదు. ఆత్మను చింతించెనా లోక చింత ఉండదు. ఆత్మసాక్షాత్కారమునకు లోచూపే ప్రధానము. మౌనమే స్వభావము. ధ్యానమననములే దానికి సాధనలు. వశమందు లేని మనోశక్తి ఆత్మకు పరమ శత్రువు.

(ఆ.దీ.పు. 179)

 

కొంత లవణమును (ఉప్పును) పాత్రలోని జలములో వేస్తేకొంత సేపటికి అది కరిగి సర్వత్రా వ్యాపిస్తుంది. లవణము సర్వత్రా వ్యాపించినప్పటికికంటికి కనబడదు. చేతికి చిక్కదు. అయితే లేదని చెప్పుటకు ఏమాత్రము వీలుకాదు. జిహ్వయందు వేసుకొనిన దాని రుచి తెలుస్తుంది. సర్వత్రా వ్యాపించిన రుచినే నీవు. అదే ఆత్మఅదే సత్యము. అదే తత్త్వమసి.

(సా॥ పు 393)

 

చావు పుట్టుక లేని శాశ్వతుండు! ఆది మధ్యాంత రహితుడనాదివాడు!

తాను చావక చంపబడక అంతటను సర్వసాక్షియై ఆత్మయుండు -

(సా. పు 433)

 

కంటికి గ్రుడ్డును కాటుక నంటనట్టి

జిడ్డు ఏమాత్రము అంటక జిహ్వయుండు

బురదనంటక తామరపువ్వులుండు

ఏది అంటక యుండెడి అదియె ఆత్మ !

(సా. పు 439)

 

వాక్కుమనస్సుప్రాణము. ఈ మూడింటి సమ్మిళిత స్వరూపము ఆత్మ. దీనికి మూడు అవస్థలు. జాగ్రతస్వప్నసుషుప్తులు మేల్కొని యుండిదృశ్య జగత్తులో అన్నిటిని చూడటంవినటం మాట్లాడటంఅను భవించడం. ఇలాంటి పంచేంద్రియములతో కూడిన తత్త్వం జగత్తు. ఇది విశ్వతత్వానికి సూక్ష్మ రూపం కనక నిజానికివిశ్వుడుఅనిమరియొకపేరు.విశ్వుడు24తత్వాలతోకూడివుంటాడు.కర్ణేంద్రియములు,5 జ్ఞానేంద్రియములు,5 కోశములు,5 పంచ ప్రాణములు,4అంతఃకరణములు-మనస్సుఅహంకారముచిత్తముబుద్ధి. ఈ 24 తత్వాలతో కూడినది బాహ్య జగత్తు లేక విశ్వుడు. ఇది జాగ్రదవస్థ రూపము. .

 

మనస్సుబుద్ధిచిత్తముఅహంకారము అను 4 గింటితోటి కూడుకొని స్వప్నావస్థ ఉంటుంది. బాహ్యమైన కర్మేంద్రియములతో దీనికి పనిలేదు. ఇటువంటి పరిస్థితులలోతేజోమయ రూపాన్ని ధరిస్తుంది. కనుక స్వప్నావస్థకుతైజసుడు అని పేరు. సుషుప్తి. ఇదే కారణావస్థ అనగా మంచి సుషుప్తి అనగా నిద్రమంచి గాఢనిద్రయని సుషుప్తి అర్ధము. గాఢనిద్రలోకేవలము ప్రజ్ఞ మాత్రమే మిగిలి యుంటుంది. కనుక సుషుప్తిలో ఉన్నవానికి ప్రాఙ్ణుడని పేరు. విశ్వుడుతైజసుడుప్రాజ్ఞుడుయీ మూడు కూడా ఆత్మకు గల పేర్లు మాత్రమే.

(సా. పు. 290)

 

అణువు కంటెను సూక్ష్మమై అణువు ఉండు

ఘనము కంటెను ఘనమై కనిపించుచుండు

అణు ఘనముగాఘనమె అణువుగనుండు

అణువెఆత్మయైఆత్మయే అణువుగనుండు.

(శ్రీ ఏ. 1996 పు. 5)

 

(చూ|| అంతరాత్మఅంతర్వాణిఆత్మజ్ఞానము. అజ్ఞానము యొక్క పరాకాష్ట ఆహారము, గౌణశ్చేన్నార్మశబ్దాత్.చదువు.చైతన్యముజ్ఞానముత్రిగుణములుదివ్యప్రకటనలు. దేహముబుద్ధిబ్రహ్మభక్తి,, రాజబాటశబ్దము. శరీరము. సాక్షాత్కారముహిరణ్యగర్భ తత్త్యం)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage