బెంగుళూరులో టెలిఫోన్ ప్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవారు అందరూ ఆడవారే. “ఎందుకు మగపిల్లల్ని తీసుకోరు"? అని ఆ ఛైర్మన్ ను ప్రశ్నించాను. అప్పుడు ఆ చైర్మన్ "ఒక ఆడపిల్ల చేసే పని పదిమంది మగపిల్లలు కూడా చేయరు”? అన్నాడు. ఆడవారు పట్టుదలపడితే దానిని సాధించేదాకా నిద్రపోరు. ఇంకా ఒక చిన్న విషయం గమనించండి. మగవారు కారు నడుపుతారు. ఆడవారు నడుపుతారు. కాని ఎక్కువ యాక్సిడెంట్లు మగవారు నడిపే కార్లకే అవుతుంటాయి. ఎందువలన? ఆడవారు మగవారికన్నా ఏకాగ్రతతో కారు నడుపగలరు. ఈ ఏకాగ్రత మగవారిలో కూడా వచ్చినప్పుడు దేశం అన్ని రంగాలలో బాగుపడుతుంది. ప్రత్యేకంగా సత్యసాయి సంస్థలలో పనిచేసేవారు కడు జాగరూకతతో వుండాలి. ఇక్కడ పని చేసేవారు మంచి చేసినా చెడ్డచేసినా అది సత్యసాయికే వస్తుంది. కనుక సత్యసాయికి పేరు తీసుకొని రావాలంటే మీరు సత్యమైన మార్గమును అనుసరిస్తూ రావాలి. మన సంస్థలో ఓకరినొకరు కలహించుకుంటున్నారనే నింద రాకూడదు. మనలో ఏమాత్రం బేధభావములు పెట్టుకోకూడదు. ఐకమత్యంతో సాధించడానికి ప్రయత్నం చేయాలి. అన్నింటికీ ప్రేమయే ఆధారము. ప్రేమలో దైవము. ఆ ప్రేమయందే జీవించడానికి ప్రయత్నం చేయండి లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్...
(శ్రీ. డి. 98 పు. 9)