ఆంగ్లభాషా మోహ మావరించిన నాడె
స్వమత విజ్ఞానంబు సన్నగిల్లె
స్వమత విజ్ఞానంబు సన్నగిల్లిననాడె
స్కారభావంబు సమసిపోయె
సంస్కారభావంబు సమసిపోయిననాడె
ధర్మంబు క్షీణమై ధర తొలగిననాడె
భారతీయోన్నతి భగ్నమయ్యె
కాన ఇప్పుడైన మీరలు కన్ను తెరచి
తెలివితో కాంచుడో భారతీయులార!
(శ్రీవామా2020పు15)