జీవితంలో సుఖం కలిగితే పొంగిపోతారు. దుఃఖం కలిగలితే కుంగిపోతారు. అలా కాకుండా అన్నిటినీ సమదృష్టిలో చూడటమే నిస్పంగత్వం, దాని వల్ల శాంతి చేకూరుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఆకాశంలో పక్షులు, విమానాలు, మేఘాలూ తిరుగుతుంటాయి. అయినా వాటి సంచారం వల్ల ఆకాశానికి ఏమి కాదు. మన మనస్సును కూడా ఆకాశంలో దేనికీ చలించకుండా సమదృష్టితో మెలగేటట్లు చేయాలి. శరీరాని కన్నా మనసుకు పోషణ అవసరం. లేకుంటే సుస్తీ చేస్తుంది. డాక్టర్లు విటమిన్ల లోపం వల్ల జబ్బు లొస్తాయంటారు. నేను విటమిన్ జి (జి అంటే God) లోపం అంటాను. నేను సూచించే చికిత్స నామ జపం దేవుని పేరు తలుచుకోండి.! ఆయన ప్రశస్తిని మననం చేయండి! ఆయన కరుణను కొని యాడండి! ఇదే విటమన్ జి! అదే ఔషధం. ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం మంచి అలవాట్లు - ఇవిచికిత్సలో మూడింట రెండువంతులు. మిగతా మూడోవంతు మెడిసిన్!
(శ్రీసా.గీ.పు.112)