వాసనలు రెండు విధములు : శుభమనియు, అశుభ మనియు, శుద్ధ వాసనలైనచో అతనికి త్వరలో మోక్షప్రాప్తి చేకూరును. జపము, ధ్యానము, సత్కర్మ, దానము, ధర్మము, నిస్స్వార్థ సేవ, క్షమ, దయ మొదలగునవి మంచి వాసనలు, అవే శుభ్రమైనవి. క్రోధము, హింస, కామము, దురాశ, స్వార్థము మొదలగునవి అపవిత్ర వాసనలు, లేదా అశుద్ధ వాసనలు. ఒక ముల్లును మరొక ముల్లుతో తీసి రెండును పారవేయు విధముగా, అపవిత్రమైన వాసనలను పవిత్ర వాసనలతో తిసి తదుపరి మంచి వాసనలను కూడా నిర్మూలము చేయవలెను. మోక్ష సాధనకు పవిత్ర వాసనలు తోడ్పడునే కానీ, పవిత్ర వాసనలు బహౌజన్మలను బంధించుచున్నవి. జీవన్ముక్తులకున్న పవిత్ర వాసనలను కూడా నిర్మూలము చేయవలెను. కాల్చిన గింజ వంటివి జీవన్ముక్తుని యందు ఇంద్రియానందము. తృష్ణ, మోహము అని ఆత్మసందర్శనముచే మాయమగుచున్నవి. తనకు ప్రియమైన దేదియూ ఉండదు, ఎచ్చట సూర్యుడస్తమించునో అచట నిద్రించును. తనను గురించి ఇతరులకు తెలియకుండు నట్లు సంచరించును.
(ఉ.వా. పు. 83, 84)