గ్రామమునకు ఇండ్లే శృంగారము. సముద్రమునకు ఆలలే శృంగారము. ఆకాశమునకు చంద్రుడే శృంగారము, స్త్రీకి గుణమే శృంగారము, భక్తులకు నొసట విభూతే శృంగారము. కనుక మానవునకు గుణమే శృంగారము. ఆ గుణ శృంగారమును ఈనాడు విసర్జించి బాహ్య శృంగారము కోసం భ్రమించిపోతున్నాం.
(శ్రీవా.ఆ.2000 పు.10)
మానవులకు మానవత్వమే శృంగారము. మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినది మానవత్వము. ఎన్ని విద్యలు నేర్చిన, ఎంతటి వైజ్ఞానికుడైన, ఎంతటి పదువులనేలినా మానవత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందేమో సమాజము, రాజ్యము, దేశము అంతంత అభివృద్ధిఔతుంది. మానవత్వమే కోల్పోయిన సమాజము యొక్క గౌరవము పోతుంది. సమాజముపై ఆధారపడినదేశము తన గౌరవాన్ని కోల్పోతుంది.
(బృత్ర.పు. 169/170)